హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 24 నుండి  6వ తరగతి నుండి  విద్యార్థులకు క్లాసులు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రేపటి నుండి మార్చి 1వ తేదీలోపుగా 6వ తరగతి నుండి విద్యార్ధులకు క్లాసులను ప్రారంభించుకోవచ్చని తెలంగాణ విద్యాశాఖ ఆదేశించింది.

రాష్ట్రంలో ఇప్పటికే 9వ తరగతి నుండి ఆ పై తరగతులకు ఈ నెల 1వ తేదీ నుండి తరగతులను నిర్వహిస్తున్నారు. తాజాగా 6వ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.పాఠశాలల్లో కోవిడ్ నిబంధలను పాటించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.కేసులు తక్కువగా నమోదౌతున్నాయని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. స్కూళ్లకు వచ్చే విద్యార్ధులకు కూడ జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం సూచించింది.