Asianet News TeluguAsianet News Telugu

ఆ భూములను వదిలేయాలి: భూ కబ్జాదారులకు తెలంగాణ సర్కార్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలోని అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని  తెలంగాణ దేవాదాయ శాఖ భావిస్తోంది. దేవాదాయ శాఖ భూములను ఆక్రమించిన వారు వెంటనే వదిలేయాలని దేవాదాయ శాఖ ఆదేశించింది.

telangana endowment commissioner warns to land grabbers
Author
Hyderabad, First Published Apr 18, 2019, 2:33 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని  తెలంగాణ దేవాదాయ శాఖ భావిస్తోంది. దేవాదాయ శాఖ భూములను ఆక్రమించిన వారు వెంటనే వదిలేయాలని దేవాదాయ శాఖ ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఏఏ దేవాలయానికి ఎన్ని ఎకరాల భూమి ఉంది,  ఎన్ని ఎకరాల భూమి దేవాలయం స్వాధీనంలో ఉంది, ఎన్ని ఎకరాల భూమి  ఇతరుల స్వాధీనంలో ఉందనే విషయమై  కూడ తెలంగాణ దేవాదాయ శాఖ  వద్ద  ఆధారాలు లేవు.

ఇప్పటికే కొన్ని దేవాలయాలకు చెందిన భూములు  అన్యాక్రాంతమైన విషయం దృష్టికి వచ్చిన సమయంలో అన్యాక్రాంతమైన భూములను వెంటనే  స్వాధీనపర్చాలని కూడ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  కానీ  దేవాదాయశాఖ ఆదేశాలను భూ ఆక్రమణదారులు పట్టించుకోలేదు.

దీంతో దేవాదాయ శాఖ  గురువారం నాడు చివరిసారి హెచ్చరికలు జారీచేసింది. అన్యాక్రాంతమైన  దేవాలయ భూములను తిరిగి ఇవ్వకపోతే  చట్టపరమైన చర్యలు తీసుకొంటామని  దేవాదాయ శాఖ కమిషనర్‌ హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios