Employees Postings: కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన, కేటాయింపుల‌ ప్రక్రియ పూర్తి చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయులు సహా జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక‌.. జోనల్, మల్టీజోనల్ కేడర్ పోస్టుల కసరత్తు కొనసాగుతోంది. మ‌రో రెండు రోజుల్లో పోస్టింగులు ఇచ్చి జాయిన్ అయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది రాష్ట్ర‌ప్ర‌భుత్వం. ఈ మేర‌కు వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది రాష్ట్ర‌ స‌ర్కార్. 

Employees Postings: కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం యాంత్రాగం భావిస్తోంది. ఉపాధ్యాయులు సహా జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తి కాగా... జోనల్, మల్టీజోనల్ కేడర్ పోస్టుల కసరత్తు కొనసాగుతోంది. 

ఒకటి, రెండు రోజుల్లో పోస్టింగులు ఇచ్చి వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వైపు సంఘాలు, పార్టీలు స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఉద్యోగుల‌కు అన్యాయం జ‌రుగుతోందని ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. ఇవేమి ప‌ట్ట‌న‌ట్టు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని అధికార వ‌ర్గాలు చెప్తున్నాయి. ఒక ఉపాధ్యాయులకు సంబంధించి కూడా కేటాయింపుల విధానంలో కొత్త ఆల‌స్య‌మ‌వుతుండ‌ట‌.

Read Also: GO No 317 controversy: ఆ జివో ఏం చెబుతోంది, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారం.. జిల్లా స్థాయిలోని రెండున్నర లక్షల ఉద్యోగులకు గాను.. దాదాపు 38 వేల మంది బ‌దిలీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యేక కేటగిరీలు, దంపతుల విభాగంలో తమకు పోస్టింగులు ఇవ్వాలని వేల సంఖ్యలో అప్పీళ్లు రావడంతో.. ప్రభుత్వం గత 10 రోజులుగా వాటిని పరిశీలిస్తూ తుది నిర్ణయం తీసుకోవడానికి తర్జనభర్జన పడింది. ఆ ప్ర‌క్రియ పూర్తి అయ్యాకే ఖాళీలకు అనుగుణంగా పోస్టింగులు ప్ర‌క్రియ ప్రారంభించినట్టు తెలుస్తోంది. అటు జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టులకు సంబంధించి బ‌దిలీలు, పోస్టింగ్ ల ప్రక్రియను వేగవంతం చేసింది రాష్ట్ర‌ప్ర‌భుత్వం. ఈ విభాగంలో వ‌చ్చిన‌ అప్పీళ్ల పరిష్కారం దాదాపుగా పూర్తయ్యిన‌ట్టు తెలుస్తోంది. 

Read Also: స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన.. విధివిధానాలకు ఖరారు చేసిన తెలంగాణ సర్కార్..

జోన‌ల్ , మ‌ల్టీ జోన‌ల్ విభాగంలో తొమ్మిది వేల మంది వరకు ఉద్యోగులు బ‌దిలీ కానున్న‌ట్టు సమాచారం. ఇప్ప‌టికే వారికి పోస్టింగులు ఇచ్చేందుకు.. ఆయా సంబంధిత శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశాయి. ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న వైద్య-ఆరోగ్య తదితర శాఖల్లో జోన్ల వారిగా ప్రత్యేకాధికారులను నియమించిన‌ట్టు తెలుస్తోంది. ట్రాన్స్ ఫ‌ర్ , పోస్టింగుల‌కు సంబంధించిన ప్ర‌క్రియ ఈ నెల ఏడో తేదీ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. 

Read Also: ఉద్యోగ దంప‌తుల బ‌దిలీల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌ చేసిన తెలంగాణ సర్కార్.. ఆ తర్వాతే దరఖాస్తుకు చాన్స్

 కొత్త జోనల్ విధానం ప్ర‌కారం.. డీఎస్పీ, ఆర్డీఓ, తదితర కీలక పోస్టులు రాష్ట్ర స్థాయి నుంచి మల్టీజోనల్ స్థాయికి మార్చారు. ఈ కేడర్ పోస్టింగుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ సూచించారు. పోస్టింగుల ప్రక్రియ వేగవంతం చేయాలని... రెండు, మూడు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పోస్టింగ్ ప్ర‌క్రియ పూర్తయ్యాక మ్యూచ‌వ‌ల్ ట్రాన్ ఫ‌ర్స్ అంశంపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.