telangana elections 2023 : బిర్లా టెంపుల్, నాంపల్లి దర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేకపూజలు...
గాంధీ భవన్ నుంచి బిర్లా టెంపుల్ కు బయల్దేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున వెళ్లడానికి వీల్లేదని చెప్పేవారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అభ్యర్థులంతా రేపటి పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల ఆర్గనరేతులందరూ గురువారం జరిగే పోలింగ్ లో తమకే అధిక ఓట్లు పడాలని, తమ పార్టీని గెలవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం బిర్లా మందిర్ కు వెళ్లారు. బిర్లా మందిల్లోని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడి ముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.
రేవంత్ రెడ్డితో పాటు బిర్లా మందిర్ కు వెళ్లిన వాళ్లలో తెలంగాణ ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, విహెచ్ పలువురు నేతలు ఉన్నారు. వీరంతా బుధవారం ఉదయమే గాంధీ భవన్ నుంచి బయలుదేరి బిర్లా టెంపుల్ కు వెళ్లారు. అయితే గాంధీభవన్ దగ్గర నేతలు గుంపుగా బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురుకు మించి వెళ్లకూడదని, ఎన్నికల కోడ్ ప్రకారం అది కుదరదని చెప్పారు. ఐదుగురు మాత్రమే వెళ్లాలని సూచించారు.
election rules : ఓటు వేయడానికి వెళ్లేముందు ఇవన్నీ ఉన్నాయో లేదో.. చెక్ చేసుకోండి...
వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న నేతలు మాణిక్రావు,రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్, మల్లు రవి… మాత్రమే బిర్లా టెంపుల్ కు వెళ్లారు. బిర్లా టెంపుల్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకులంతా కలిసి నాంపల్లి దర్గాకు కూడా వెళ్లారు. అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాంపల్లి దర్గా దగ్గర ప్రార్థనలు చేసిన వారిలో ఏఐసిసి ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, నరేందర్ రెడ్డి, వీహెచ్ లు ఉన్నారు.