Asianet News TeluguAsianet News Telugu

telangana election results 2023 : సెటిలర్ల ఓట్లన్ని కేసీఆర్ పార్టీకే...!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. మ్యాజిక్ ఫిగర్ ని దాటి సీట్లు గెలుచుకుంది. గ్రామీణ తెలంగాణ కాంగ్రెస్ లో తమ భవిష్యత్తుకు దారి చూసే వెలుగును చూసింది. హైదరాబాద్, గ్రేటర్, రంగారెడ్డిల్లో తప్ప మొత్తం తెలంగాణ అంతా కాంగ్రెస్ ను గెలిపించింది. కానీ, దీనికి భిన్నంగా ఉమ్మడి  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించి.. తామిక్కడ పదిలం అని నిరూపించుకుంది. దీనివెనకున్న కారణాలను విశ్లేషించుకుంటే...

telangana election results 2023 : Settlers' votes to KCR's party - bsb
Author
First Published Dec 4, 2023, 12:21 PM IST

ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల్లో మొత్తం 15 సీట్లలో బీఆర్ఎస్, దానికి సపోర్ట్ చేసే ఎంఐఎం, ఒక్కసీటులో బీజేపీ కైవసం చేసుకుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డిలో ఉన్న 14 సీట్లలో పది స్థానాలను బీఆర్ఎస్ పదిలపరుచుకుంది. ఇంతగా బీఆర్ఎస్ ను గెలిపించడానికి.. తెలంగాణ అంతా నమ్మిన కాంగ్రెస్ ను వీరు నమ్మకపోవడానికి కారణాలు ఏంటి?... 

- ముందుగా చెప్పుకోవాల్సింది.. ఐటీ, పరిశ్రమల, పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా కేటీఆర్ ఛరిష్మా. బ్రాడ్ గా చెబితే అభివృద్ధిని పట్టణాలు అక్కున చేర్చుకున్నాయి. కానీ పల్లెలు తిరస్కరించాయి.

- గ్రామీణ స్థాయిలో ఉన్న ఓటర్లకు కావాల్సిన కనీస అవసరాలు, తాగు, సాగు నీరు, సంక్షేమ పథకాల అందుబాటు విషయంలో నిర్లక్ష్యం.

- మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డిలో గెలుపుకు ఓ వైపు బీఆర్ఎస్ వర్గాల్లో సంతోషం ఉన్నప్పటికీ.. వీటి వెనుక కారణాలు హైదరాబాద్ లో లేని తెలంగాణ ఆత్మ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణవాళ్లమే అని చెప్పుకుంటున్న ఇక్కడి ఓటర్ల ఉనికిని ప్రశ్నించేలా ఉంది.

ముందుగా ఇక్కడి వారు బీఆర్ఎస్ ను గెలిపించడానికి కారణాలు చూస్తే...

- హైదరాబాద్, రంగారెడ్డి, గ్రేటర్లలో ఎటు చూసినా కనిపిస్తున్న ఆకాశహర్మ్యాలు.. ఐటీ హబ్బులు, రింగురోడ్లు, ఫ్లై ఓవర్లు, కొత్త సెక్రటేరియట్, అమరవీరుల జ్యోతి, అంత్యంత ఎత్తైన అంబేద్కర్ స్టాచ్యూ.. మెట్రో మార్గాలు.. పెరిగిన భూముల ధరలు, రియల్ ఎస్టేట్.. ఇవన్నీ కాదనలేని అభివృద్దే ఒప్పుకోవాల్సిందే.

- మరో కారణం ఇక్కడి ఓటర్లలో ఎక్కువమంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం. వారికి ఇక్కడ ఓటుహక్కు ఉన్నా.. హైదరాబాద్ తో తప్పా, తెలంగాణతో సంబంధం లేకపోవడం.

- ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెటిలర్స్. తెలంగాణ ఉద్యమ సమయంలో బాగా వినిపించిన మాట.. ఇప్పుడిది స్థానికుల కిందికే మారిపోయింది. వీరంతా గంపగుత్తగా బీఆర్ఎస్ కే మొగ్గు చూపారు. 

- అసలైన తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినా.. ఎత్తి అవతల పడేసినా... బీఆర్ఎస్ వీరెందుకు భుజానా మోశారంటే.. ఇక్కడున్న వారి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఇన్నేళ్ల పాలనలో వారికి ఎలాంటి ఇబ్బందులూ కలిగించని బీఆర్ఎస్ ప్రభుత్వం.

- ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ కు చేతనవుతుందో లేదో అన్న అనుమానం. 

- బీఆర్ఎస్ రాకపోతే తమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందేమో అన్న భయం కూడా మరో కారణం. 

- ఈ పదేళ్లలో తెలంగాణలో మతకలహాలు లేవు. పాతబస్తీ ప్రశాంతంగా ఉంది. బీఆర్ఎస్ పోతే మళ్లీ ఇవి వెలుగు చూస్తాయన్న భయం. 

- భూముల ధరలు విపరీతంగా పెరగడం, రియల్ ఎస్టేస్ బాగా అభివృద్ది చెందడం. బీఆర్ఎస్ ప్రభుత్వంపోతే భూముల ధరలు తగ్గుతాయన్న భయం కూడా మరో కారణం. రంగారెడ్డి జిల్లాలో కూడా భూముల రేట్లు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతాల్లోని వారు ధనవంతులుగా మారారు.  ఫాం హౌజులు, పారిశ్రామిక ప్రాంతాలతో బిజినెస్ పెరిగింది. వీటికి నీళ్లు, కరెంట్ ఈ ప్రభుత్వం లేకపోతే ఇబ్బందవుతుందేమో అని భావించడం. దీంతో అభివృద్ధి తప్ప అసలు సమస్యలు కనిపించకపోవడం కనిపిస్తుంది. 

- హైదరాబాద్ లో ఓటింగ్ పర్సంటేజీ తగ్గిపోవడం కూడా మరో కారణం. ఓటింగ్ పర్సంటేజీ తగ్గడానికి చదువుకున్న ఓటర్లలో, ఐటీ ఎంప్లాయిస్ లో ఉన్న బద్ధకం. ఇంట్లో కూర్చుని ఫోన్లు, ల్యాప్ టాప్ లు, సోషల్ మీడియాల్లో అన్యాయం, అక్రమం అంటూ గగ్గోలు పెడుతూ, పోస్టులు పెట్టడం, విమర్శించడానికే పరిమితం అయ్యారు కానీ.. వాటిని దాటి తమ అసహనాన్ని ఓటు రూపంగా మలచడానికి ఇష్టపడలేదు. 

- మూడు ప్రాంతాల్లోని ఓటర్లలో మెజారిటీ బాగా చదువుకున్నవారే. ఉన్నతోద్యోగులు, ఐటీ ఎంప్లాయిస్, రకరకాల సంస్థల్లో ప్రముఖంగా పనిచేస్తున్నవారే. వీరంతా పైపై అభివృద్ధినే చూశారు.. కానీ వాటి వెనుక దెబ్బతిన్న మౌళిక సదుపాయాలను చూడలేకపోయారు.

- ఉదా.కు హైదరాబాద్ లో అభివృద్ధి అంతా కేంద్రీకృతమైన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొత్తగా పెరుగుతున్న గ్రేటర్ లలో గమనిస్తే.. వర్షాకాలం వస్తే చాలు వణుకు పుడుతుంది. ఒక గంటపాటు గట్టిగా వర్షం పడితే చాలు.. రోడ్లు సముద్రాల్ని తలపిస్తాయి. మోకాలి లోతు నీళ్లు.. గంటల తరబడి భారీగా ట్రాపిక్ జాంలు.. ఈ సమయంలో సోషల్ మీడియా అసహనంతో హోరెత్తుతుంది. కానీ దీన్ని ఓటుగా వ్యతిరేకతగా మార్చలేకపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios