తెలంగాణ ఎస్ఈసీ పార్థసారథికి కరోనా.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పాజిటివ్
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే సీఎస్ సోమేశ్ కుమార్‌కు పాజిటివ్‌గా తేలగా.. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కరోనా బారిన పడ్డారు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే సీఎస్ సోమేశ్ కుమార్‌కు పాజిటివ్‌గా తేలగా.. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కరోనా బారిన పడ్డారు.
గురువారం ఆయనకు నిర్వహించిన కోవిడ్ పరీక్ష ఫలితాలు ఈరోజు వచ్చాయి. వీటిలో తనకు పాజిటివ్‌గా తేలినట్లు పార్థసారథి స్వయంగా ప్రకటించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్నానని తెలిపారు.
Also Read:తెలంగాణలో 3వేలకు దగ్గర్లో కరోనా కేసులు
కాగా, గత నెలలో నిమ్స్‌లో పార్థసారథి కోవిడ్ టీకా తొలి డోసు కూడా వేసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. గతకొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని పార్థసారథి సూచించారు.
మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2, 909 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కోవిడ్ కారణంగా ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,791 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 487 కేసులుండగా.. ఆ తర్వాత మేడ్చల్ 289, నిజామాబాద్ 202 వున్నాయి.