హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఏడు పోలింగ్ బూత్ లలో ఇబ్బందులు ఎదురయ్యాయని అందుకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోందన్నారు. 

ప్రింటింగ్ ప్రెస్ లో జరిగిన పొరపాటు ఒకటైతే, సిబ్బంది నిర్లక్ష్యం మరోకటన్నారు. ఆర్వో బ్యాలెట్ పేపర్లను సరిచూసుకోవాలని కానీ చూడలేదన్నారు. అధికారులు ఆ బ్యాలెట్ ను చెక్ చేసుకుంటే సరిపోవునని అయితే వారు చెక్ చేసుకోలేకపోవడం వల్లే ఇది జరిగిందన్నారు. 

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ఫలితాలపై తాము కసరత్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం 27న ఎన్నికల ఫలితాలు వెలువడించనున్నట్లు తెలిపారు. 

32 జిల్లాలలో 123 కేంద్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మూడు విధాలుగా జరుగుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు.