తెలంగాణలో ఖాళీగా ఎంపీటీసీ, జడ్‌పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నద్దమైంది. ఏప్రిల్ 4న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనుంది ఎస్ఈసీ.

ఏప్రిల్ 8న అభ్యంతరాల స్వీకరణ, 12న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 34 ఎంపీటీసీ, 99 సర్పంచ్, 2,004 వార్డులు ఖాళీగా వున్నాయి. దీంతో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలుకానుంది.

మరోవైపు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 31న నామినేషన్లను పరిశీలిస్తారు.

ఏప్రిల్​ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రిల్​ 17న పోలింగ్​, మే 2న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి  7 గంటల వరకు కొనసాగుతుంది