Asianet News TeluguAsianet News Telugu

రోజు గడిచినా పోలింగ్ శాతాన్ని ప్రకటించని ఈసీ, జాప్యమెందుకు?

ఎన్నికలు అంటేనే పోలింగ్ శాతం ఎంత అనేది ప్రధానమైన అంశం. ఆ పోలింగ్ శాతాన్ని బట్టి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అన్నది అంచనా వేయవచ్చు. ఉదయం పోలింగ్ ఎక్కువ అయ్యిందా మధ్యాహ్నాం ఎక్కువ అయ్యిందా లేక సాయంత్రం అయ్యిందా అనే అంశాలను బేరీజు వేసుకుని విజయవకాశాలపై ఆయా పార్టీలు ఓ అంచనాలకు వస్తాయి. కానీ తెలంగాణలోని పార్టీలకు ఆ అవకాశం ఇవ్వలేదు .

telangana election commission can not announced polling percentage
Author
Hyderabad, First Published Dec 8, 2018, 6:18 PM IST

హైదరాబాద్: ఎన్నికలు అంటేనే పోలింగ్ శాతం ఎంత అనేది ప్రధానమైన అంశం. ఆ పోలింగ్ శాతాన్ని బట్టి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అన్నది అంచనా వేయవచ్చు. ఉదయం పోలింగ్ ఎక్కువ అయ్యిందా మధ్యాహ్నాం ఎక్కువ అయ్యిందా లేక సాయంత్రం అయ్యిందా అనే అంశాలను బేరీజు వేసుకుని విజయవకాశాలపై ఆయా పార్టీలు ఓ అంచనాలకు వస్తాయి. కానీ తెలంగాణలోని పార్టీలకు ఆ అవకాశం ఇవ్వలేదు 

ఎన్నికల కమిషన్. అది ఎలా అనుకుంటున్నారా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 24 గంటలు కావస్తోంది. కానీ తెలంగాణ ఎన్నికల సంఘం మాత్రం ఇంకా ఎన్నికల శాతాన్ని ప్రకటించలేదు. అయితే ఆయా పార్టీలు మాత్రం తమకు తాముగా సొంతంగా ఎన్నికల శాతాన్ని ప్రకటిస్తోంది. 

అధికార టీఆర్ఎస్ పార్టీ 73 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందని చెప్తుంటే ప్రతిపక్ష పార్టీలు కూడా తమకు తోచిన శాతాన్ని ప్రకటిస్తోంది. 75 శాతం దాటిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.  అయితే అధికారికంగా ఎన్నికల కమిషన్ మాత్రం ప్రకటించలేదు. 

అయితే ఈసారి ఎన్నికల కమిషన్ ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఫెయిల్ అయిందని తెలుస్తోంది. అయితే ఎన్నికల పోలింగ్ శాతాన్ని ప్రకటించేందుకు సిఈవో రజత్ కుమార్ మానిటరింగ్ సెల్ లో కసరత్తు చేస్తున్నారు. అయితే మరికాసేపట్లో సిఈవో అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios