రాజ్‌భవన్‌ స్కూలు హెడ్మాస్టర్‌పై విద్యాశాఖ వేటు వేసింది. చదువులో వెనుకబడ్డారని 15 మంది విద్యార్ధులకు టీసీ ఇచ్చిన ఘటనపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కమీషన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యాశాఖ పాఠశాలకు వెళ్లి విచారణ జరిపింది. ఇందులో హెడ్మాస్టర్ తప్పు ఉన్నట్లు తేలడంతో  ఆయనపై వేటు వేసింది.

రాజ్‌భవన్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వెయ్యి మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఈ క్రమంలో 15 మంది విద్యార్ధఉలు చదువులో బాగా వెనుకబడి వుండటాన్ని హెడ్మాస్టర్ గుర్తించారు.

త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో వారు ఫెయిల్ అయితే పాఠశాలకు చెడ్డపేరు వస్తుందని భావించిన ఆయన వారికి టీసీలు ఇచ్చి పంపేశారు. ఈ విషయం బాలల హక్కుల సంఘం దృష్టికి రావడంతో వారు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.