తెలంగాణ టెన్త్ పేపర్ లీక్ కేసు: హోల్డ్‌లోనే హరీష్ ఫలితాలు

టెన్త్ పేపర్ లీక్ కేసులో ఆరోపణలు  పేపర్ బయటకు తీసుకు వచ్చిన హరీష్ అనే విద్యార్ధి  ఫలితాలను  అధికారులు వెల్లడించలేదు.

Telangana Education Department not declared Hareesh SSC Resultss  lns

హైదరాబాద్: హన్మకొండ టెన్త్ పేపర్ లీక్  కేసులో  హరీష్ అనే విద్యార్ధి  పరీక్ష ఫలితాలను  తెలంగాణ విద్యాశాఖ   హోల్డ్ లో పెట్టింది.  తెలంగాణ  టెన్త్ పరీక్ష  ఫలితాలను  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  బుదవారంనాడు  విడుదల చేశారు. అయితే  హరీష్ ఫలితాలు విడుదల చేయలేదు. 

ఈ ఏడాది  ఏప్రిల్ 4న  టెన్త్ క్లాస్ హిందీ పేపర్  లీక్ అయిందని సోషల్ మీడియాలో  ప్రచారం సాగింది.  అయితే   టెన్త్ క్లాస్ విద్యార్ధి హరీష్ నుండి  ఈ ప్రశ్నాపత్రం   ఫోన్ లో రికార్డు  చేసి  వాట్సాప్ లో షేర్ చేసినట్టుగా  పోలీసులు గుర్తించారు.   ఈ కేసులో   బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి  సంజయ్   సహా పలువురిని పోలీసులు అరెస్ట్  చేశారు. జర్నలిస్టు ప్రశాంత్  ద్వారా బండి సంజయ్ కు  వాట్సాప్ లో  ఈ  ప్రశ్నాపత్రం చేరిందని  పోలీసులు ప్రకటించారు.  

also read:తెలంగాణ టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి: రిజల్ట్స్ కోసం చెక్ చేయండిలా...

ఈ ప్రశ్నాపత్రం బయటకు రావడానికి  కారణమైన  హరీష్ ను  డీబార్  చేశారు.  దీంతో  హరీష్  కోర్టును ఆశ్రయించారు. హరీష్ ను పరీక్షలు రాసేందకుహైకోర్టు అనుమతిని ఇచ్చింది. కోర్టు అనుమతితో పరీక్ష  హరీష్  పరీక్ష ఫలితాలను  విద్యాశాఖ అధికారులు ప్రకటించలేదు.  హరీష్ ఫలితాలను ఇంకా హోల్డ్ లోనే  పెట్టారు.  హరీష్ ఫలితాలను  ప్రకటించాలని  ఎన్ఎస్‌యూఐ  నేతలు  ఇవళ  మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios