తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుసపెట్టి అదృశ్యమవుతుండటంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

వీరిని ఎవరు కిడ్నాప్ చేయలేదని .. కుటుంబకలహాలు, ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం వంటి వివిధ కారణాల వల్ల కొందరు ఇళ్లను విడిచిపెట్టి వెళుతున్నారని డీజీపీ స్పష్టం చేశారు.

వీటిలో దాదాపు 85 శాతం పైగా కేసుల్ని ఛేదించామని మహేందర్ రెడ్డి తెలిపారు. అదృశ్యమైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని.. ఈ వ్యవహారంలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.