Asianet News TeluguAsianet News Telugu

డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ: శాంతి భద్రతలపై చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.  రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులకు దిశా నిర్ధేశం చేశారు. 

 Telangana DGP Mahender Reddy  meets CM KCR at  Pragathi bhavan in hyderabad
Author
Hyderabad, First Published Aug 24, 2022, 4:50 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.శాంతి భద్రతల సమస్యపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సహా పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియో నేపథ్యంలో హైద్రాబాద్ లో ఉద్రిక్త పరిస్థితుులు చోటు చేసుకున్నాయి.పోలీసుల వినతి మేరకు ఈ వీడియోను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయమై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను నిన్న ఉదయమే పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. బీజేపీ తరపు న్యాయవాదుల వాదనతతో రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఇవాళ కూడ పాతబస్తీలో ఆందోళనలు సాగాయి.ఈ పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. రాజాసింగ్  అరెస్ట్  కు ముందు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులు చేజారిపోకుండా ఉండేందుకు తీసుకొంటున్న చర్యలను కూడా పోలీసు ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు.

పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో  ర్యాలీలు,సభలకు అనుమతి లేదని హైద్రాబాద్ సౌత్ జోన్ పోలీసులు ప్రకటించారు. మునావర్ ఫరూఖీపై రెండో భాగం వీడియోను కూడా త్వరలోనే అప్ లోడ్ చేస్తానని కూడా నిన్నఅరెస్ట్ కావడానికి ముందు మీడియాకు చెప్పారు రాజాసింగ్. 

సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు ఉండడంతో రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటేసింది. 10 రోజుల్లో ఈ విషయమై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. సెప్టెంబర్ 2 లోపుగా ఈ విషయమై  వివరణ ఇవ్వాలని  బీజేపీ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios