లాక్‌డౌన్‌లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4 లక్షల 80 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకి వచ్చిన వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు. సీజ్ చేసిన వాహనాలు లాక్‌డౌన్ తర్వాత కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. లాక్‌డౌన్ 99 శాతం విజయవంతమైందని.. ఈ పాస్‌ల జారీలో గందరగోళం లేదని మహేందర్ రెడ్డి వెల్లడించారు. సరిహద్దుల్లో అంబులెన్సులు, అత్యవసర వాహనాలను అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే నకిలీ విత్తనాలు అమ్మినవారిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని డీజీపీ పేర్కొన్నారు. 

Also Read:థర్ద్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్దం: కరోనాపై హైకోర్టుకు కేసీఆర్ సర్కార్ నివేదిక

మరో వైపు థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు కూడ సిద్దంగా ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.తెలంగాణలో కరోనా కేసులపై హైకోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టింది.  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ సమగ్ర నివేదికను అందించింది.  కరోనా సమయంలో  నమోదు చేసిన కేసుల వివరాలను కూడ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు అందించారు. వైద్య ఆరోగ్యశాఖ, డీజీపీ వేర్వేరుగా నివేదికలను కోర్టుకు అందించారు.