మెదక్‌లో ఖదీర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతిపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పోలీసులు చిత్ర హింసలతోనే ఖదీర్ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మెదక్‌లో ఖదీర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతిపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖదీర్ మృతిపై విచారణ జరపాల్సిందిగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అంజనీ కుమార్ ఆదేశించారు. మెదక్ పోలీసులు చిత్ర హింసలతోనే ఖదీర్ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
