హైదరాబాద్: కాబోయే సీఎం కేటీఆర్ కి  శుభాకాంక్షలు అంటూ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సమక్షంలోనే పద్మారావు ఈ వ్యాఖ్యలు చేశారు.గురువారం నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే ఉద్యోగుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా  పద్మారావు ప్రసంగిస్తూ సికింద్రాబాద్ కార్మికుల తరపున, తెలంగాణ శాసనసభ తరపున  కాబోయే సీఎం కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటించారు. అతి త్వరలోనే కేటీఆర్ సీఎం అవుతారని ఆయన చెప్పారు. 

కొంతకాలంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతారని వ్యాఖ్యలు చేస్తున్నారు.కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయగానే వేదికపై ఉన్నవారంతా చప్పట్లు కొట్టి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.  ఆ తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పద్మారావు తనకు చిచ్చ అవుతాడని ఆయన చెప్పారు.