పేద దళిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకం ప్రారంభంకానుంది. ఈ పథకం పేరును తెలంగాణ దళిత బంధుగా నామకరణం చేశారు ముఖ్యమంత్రి. 

దళిత సాధికారత పథకానికి తెలంగాణ దళిత బంధు అన్న పేరును ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. పైలట్ ప్రాజెక్ట్ కింద ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి.. తెలంగాణ దళిత బంధు పథకం అమలు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే హుజురాబాద్‌లో తెలంగాణ దళిత బంధును ప్రారంభించనున్నారు కేసీఆర్. 

పేద దళిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకం ప్రారంభంకానుంది. ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఎం ఆదేశించారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున పది వేల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

Also Read:సీఎం దళిత సాధికారిత పథకం: దళితులకు శుభవార్త... రూ. 10 లక్షల ఆర్ధిక సాయం, కేసీఆర్ ప్రకటన

సీఎం దళిత సాధికారిత పథకంపై గత నెల 27న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లోని 11,900 కుటుంబాలకు రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. రైతు బంధు పథకం మాదిరిగానే నేరుగా దళిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేయాలని నిర్ణయించారు.