Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం, చలికాలం ఇవన్నీ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీనికోసం ఎలక్షన్స్ లో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులందరూ 5నుంచి 7 రోజుల వరకు ఐసోలేట్ అయితే సెకండ్ వేవ్ నుంచి కాపాడొచ్చని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

Telangana corona cases updates - bsb
Author
Hyderabad, First Published Dec 3, 2020, 9:23 AM IST

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం, చలికాలం ఇవన్నీ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీనికోసం ఎలక్షన్స్ లో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులందరూ 5నుంచి 7 రోజుల వరకు ఐసోలేట్ అయితే సెకండ్ వేవ్ నుంచి కాపాడొచ్చని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 53, 686 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,71,492కి చేరింది.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,465కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 873మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,61,028కి చేరింది. 

రాష్ట్రంలో ప్రస్తుతం 8,999యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 6,922 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల సంఖ్య 56,05,306కి చేరింది.

Follow Us:
Download App:
  • android
  • ios