తెలంగాణ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 4,241 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. పదిరోజుల కిందట వీటి సంఖ్య 2,101గా ఉండేది. రాష్ట్రంలో నిన్ని రాత్రి 8గంటల వరకు 58,029 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 495 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కొవిడ్ తో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృత చెందిన వారి సంఖ్య 1685కి చేరింది. కరోనా బారినుంచి నిన్న 247 మంది కోలుకున్నారు. 

ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,878కి చేరింది. 4,241 యాక్టివ్ కేసుల్లో 1,616 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 142 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 99,61,154కి చేరింది.