టీఆర్ఎస్  తమ పార్టీకి  ఎన్నికల వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకొంది.  కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల వ్యూహాకర్త కోసం చూస్తోంది. ఈ మేరకు సునీల్ తో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతుంది. 

హైదరాబాద్: Prashant kishor ను ఎన్నికల వ్యూహాకర్తగా TRS నియమించుకొంది. ఈ తరుణంలో Congress పార్టీ ఎన్నికల వ్యూహాకర్త నియామకం కోసం వేట సాగిస్తుంది. ప్రశాంత్ కిషోర్ అనుచరుడు సునీల్ కనుగోలు సేవలను ఉయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందనే ప్రచారం సాగుతుంది.

టీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో తమ క్యాడర్ లో ఉత్సాహం నింపడంతో పాటు టీఆర్ఎస్ కు సవాల్ విసరాలని భావిస్తుంది. ఇందు కోసం membership నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపాలనే కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన క్యాడర్ కే పార్టీ పదవుల్లో కీలక బాధ్యతలు ఇస్తానని కూడా Revanth Reddy ప్రకటించారు.

టీఆర్ఎస్ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల వ్యూహాకర్తను నియమించుకొనే యోచనలో ఉందని సమాచారం. ప్రశాంత్ కిషోర్ కు అనుచరుడిగా ఉన్న సునీల్ కనుగోలు సేవలను వినియోగించుకొంటే ఎలా ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.

Sunil Kanugolu విజయవాడలో జన్మించారు. ప్రస్తుతం సునీల్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఇప్పటికే సునీల్ అనేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.నేతలను, పార్టీలకు విజయతీరాలకు చేర్చిన చరిత్ర కూడా సునీల్ కు ఉందని చెబుతున్నారు. అందువల్ల ఎస్కేను (సునీల్ కుమార్) కాంగ్రెస్ వ్యూహకర్తగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

రేవంత్ రెడ్డి సహా కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా సునీల్ తో న్యూఢిల్లీలో చర్చించినట్టుగా సమాచారం. మొదటి విడత చర్చలు జరిపారని సమాచారం. మరో వైపు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా సునీల్ తో చర్చలు జరిపారని కూడా ప్రచారం సాగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేయాలని కర్ణాటక పీసీసీ చీఫ్ D. K. Shivakumar, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేలు చర్చించారని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే దూకుడుగా వెళ్తోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధ: కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాంలో భాగమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కూడా ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపాయి..

టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ ప్రచారం చేసుకొంటుంది. అయితే తాము కూడా కదన రంగంలో ఉన్నామని కాంగ్రెస్ చెబుతుంది. బీజేపీది గాలి వాటం గెలుపు మాత్రమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.బీజేపీ నేతలు మాత్రం తమకు ఎన్నికల వ్యూహాకర్తలు అవసరం లేదని చెబుతున్నారు. బీజేపీ కార్యకర్తలే తమకు బలంఅని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.