Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్, టిడిపి సీనియర్ నాయకుల భేటీ...అందుకోసమేనా...?

తెలంగాణలో ఎన్నికల ప్రచారం మెదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించింది. దీంతో ఇతర పార్టీలు కూడా వేగాన్ని పెంచాయి. ఎలాగైనా కేసీఆర్ ను మళ్లీ గద్దెనెక్కకుండా చూడాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఉప్పూ నిప్పులుగా ఉండే కాంగ్రెస్, టిడిపి లు పొత్తులకు కూడా సిద్దమయ్యాయి. అయితే పొత్తులతో తన సీటుకు ఎసరు రాకుండా ఉండేందుకు ఓ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టిడిపి పార్టీ మాజీ మంత్రి కలిశారు. అయితే ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది. పొత్తులపై ఇంకా నిర్ణయాలే జరక్కుండా ఈ భేటీ జరగడంతో లోపాయికారిగా పార్టీలమధ్య పొత్తులపై చర్చలేమైనా సాగాయా అని రాజకీయ వర్గాల్లో అనుమానం మొదలైంది.

telangana congress,tdp leaders meeting
Author
Medchal, First Published Sep 8, 2018, 1:30 PM IST

తెలంగాణలో ఎన్నికల ప్రచారం మెదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించింది. దీంతో ఇతర పార్టీలు కూడా వేగాన్ని పెంచాయి. ఎలాగైనా కేసీఆర్ ను మళ్లీ గద్దెనెక్కకుండా చూడాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఉప్పూ నిప్పులుగా ఉండే కాంగ్రెస్, టిడిపి లు పొత్తులకు కూడా సిద్దమయ్యాయి. అయితే పొత్తులతో తన సీటుకు ఎసరు రాకుండా ఉండేందుకు ఓ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టిడిపి పార్టీ మాజీ మంత్రి కలిశారు. అయితే ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది. పొత్తులపై ఇంకా నిర్ణయాలే జరక్కుండా ఈ భేటీ జరగడంతో లోపాయికారిగా పార్టీలమధ్య పొత్తులపై చర్చలేమైనా సాగాయా అని రాజకీయ వర్గాల్లో అనుమానం మొదలైంది.

ఇక అసలు విషయంలోకి వెళితే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి సభ్యుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అదే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి, టిడిపి నాయకుడు దేవేందర్ గౌడ్ ను శుక్రవారం కలిశారు. దేవేందర్ గౌడ్ నివాసంలో దాదాపు అరగంటపాటు ఈ సమావేశం సాగింది. తెలంగాణ తాజా రాజీయాలపై ఇద్దరు నాయకులు చర్చించుకున్నట్లు సమాచారం.

ముఖ్యంగా పొత్తులపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, టిడిపి ల మధ్య పొత్తు ఖరారయితే మేడ్చల్ స్థానం నుండి ఎవరు పోటీ చేయాలన్న దానిపై కూడా చర్చ జరిగింది. అయితే ఈ స్థానం నుండే పోటీకి లక్ష్మారెడ్డి ఆసక్తి చూపుతుండగా దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా ఈ నియోజకవర్గం నుండే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాడు. ఈ క్రమంలో తనకు మద్దతివ్వాలని లక్ష్మారెడ్డి దేవేందర్ రెడ్డి కోరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios