Asianet News TeluguAsianet News Telugu

గెలిచేచోట కేటీఆర్‌కు.. ఓడేచోట హరీశ్‌కు బాధ్యతలా: కేసీఆర్‌కు రేవంత్ ప్రశ్న

టీఆర్ఎస్ జెండా ఓనర్ని అన్నరోజే ఈటల పీఠం కదిలిందని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. గెలిచే చోట కేటీఆర్‌కు, ఓడిపోయే చోట హరీశ్‌రావుకు బాధ్యతలా అని ఆయన నిలదీశారు. 

telangana congress mp revanth reddy fires on cm kcr ksp
Author
Hyderabad, First Published Feb 27, 2021, 6:35 PM IST

టీఆర్ఎస్ జెండా ఓనర్ని అన్నరోజే ఈటల పీఠం కదిలిందని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. గెలిచే చోట కేటీఆర్‌కు, ఓడిపోయే చోట హరీశ్‌రావుకు బాధ్యతలా అని ఆయన నిలదీశారు. పీవీ ఫోటోతో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు లేదని రేవంత్ మండిపడ్డారు.

అంతకుముందు తెలంగాణ కోసం కాంక్షించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రొఫెసర్ జయశంకర్ సారుకి అవమానం జరుగుతోందంటూ రేవంత్ తీవ్రంగా స్పందించారు. జయశంకర్ సార్ ఫొటోల కంటే సీఎం కేసీఆర్ ఫొటోలే పెద్ద సైజులో ఉండడం.. మహామనిషిని అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘త్యాగాల చరిత్రకు భోగాల చెద! స్వరాష్ట్రం కోసం ప్రాణం ఒదిలినోళ్లు, ప్రాణం పెట్టినోళ్ల చరిత్ర చిన్నబోతోంది. ఉద్యమ మార్గదర్శి జయశంకర్ ‘సారు’ ఒక్కడికే జరిగిన పరాభవం కాదు ఇది. రాష్ట్రమే కాంక్షగా.. ఉద్యమమే శ్వాసగా బతికిన ప్రతి తెలంగాణ బిడ్డకు జరిగిన అవమానం. ‘ఎవని పాలయిందిరో తెలంగాణ...?’’ అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios