మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై చర్చ

ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో  కాంగ్రెస్ నేతలు ఇవాళ భేటీ అయ్యారు.

Telangana Congress Leaders Meeting  with  Mallikharjun Kharge  lns

హైదరాబాద్: ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు  ఆదివారంనాడు భేటీ అయ్యారు. ఈ నెల  26వ తేదీన  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ సభలో  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు.  ఈ సభలో పలువురు నేతలు  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  ఇదే సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.

 ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ విషయాలపై  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో  నేతలు  చర్చించనున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో పొందుపర్చిన అంశాలతో పాటు చేర్చాల్సిన అంశాలపై  చర్చించనున్నారు.  ఈ నెల  26న చేవేళ్లలో  నిర్వహించే
 సభ గురించి కూడ  కాంగ్రెస్ నేతలు ఖర్గేతో చర్చిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై దళిత నేతలతో భట్టి విక్రమార్క చర్చించారు.  ఇప్పటికే  రైతు, యూత్ డిక్లరేషన్లను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  చేవేళ్ల సభలో  ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఈనెల  29న  వరంగల్ లో మైనార్టీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది.  ఈ ఏడాది సెప్టెంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేయనుంది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  ప్లాన్  చేసింది.

also read:దూకుడు పెంచిన కాంగ్రెస్, డిక్లరేషన్లపై ఫోకస్: సెప్టెంబర్ లో మేనిఫెస్టో విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ నాయకత్వం  కసరత్తు చేస్తుంది. ఈ మేరకు స్క్రీనింగ్  కమిటీ  తన కార్యాచరణను ప్రారంభించింది. ఆశావాహుల నుండి ధరఖాస్తులను  కాంగ్రెస్ పార్టీ  స్వీకరిస్తుంది.  ఈ నెల  25వ తేదీ వరకు  ఆశావాహుల నుండి ధరఖాస్తులను  స్వీకరిస్తారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios