ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వొద్దని.. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా హామీలు ఇవ్వాలని ఖర్గే సూచించారు. 26న చేవేళ్లలో జరిగే బహిరంగ సభలో మల్లిఖార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తారు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 26న చేవేళ్లలో జరిగే బహిరంగ సభలో మల్లిఖార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తారని అన్నారు. డిక్లరేషన్‌లో ఏయే అంశాలు పొందుపరచాలనే దానిపై ఆయనతో చర్చించామని చెప్పారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను సైతం ఖర్గేకు వివరించామని పేర్కొన్నారు. దళిత, గిరిజనులకు ఏయే అంశాలు పెట్టాలనే దానిపై చర్చ జరిగిందని భట్టి చెప్పారు. రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాలపై చర్చ జరిగిందన్నారు.
ఇక మేనిఫెస్టోపైనా టీ . కాంగ్రెస్ నేతలకు మల్లిఖార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వొద్దని.. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా హామీలు ఇవ్వాలని ఖర్గే సూచించారు. బీఆర్ఎస్‌లా మనం అమలు కాని హామీలు ఇవ్వలేమని.. రెవెన్యూ మంత్రిగా వున్నప్పుడు ఎదురైన అనుభవాలను టీ.కాంగ్రెస్ నేతలతో పంచుకున్నారు ఖర్గే.
ALso Read: దూకుడు పెంచిన కాంగ్రెస్, డిక్లరేషన్లపై ఫోకస్: సెప్టెంబర్ లో మేనిఫెస్టో విడుదల
ఇకపోతే.. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేవేళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఈనెల 29న వరంగల్ లో మైనార్టీ డిక్లరేషన్ ను పార్టీ విడుదల చేయనుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేయనుంది.
