పాతబస్తీ లాల్‌ దర్వాజ మహంకాళీ అమ్మవారిని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఏడాది తాను లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకుంటానని.. తెలంగాణ అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా రాములమ్మ తెలిపారు.

అమ్మవారి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అంతకు ముందు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ అమ్మవారికి బోనం సమర్పించారు.  బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.