ఏం మాట్లాడారో తెలియదు.. ఆ వీడియో చూశాకే యాక్షన్ : కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాణిక్ రావ్ థాక్రే
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందంటూ ఆ పార్టీ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే స్పందించారు. వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదని, తెలుసుకున్నాక స్పందిస్తానని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందంటూ ఆ పార్టీ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ మాణిక్ రావు థాక్రే స్పందించారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. అలాగే వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని థాక్రే స్పష్టం చేశారు. పొత్తులపై రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పిందే తమకు ఫైనల్ అని ఆయన పేర్కొన్నారు. వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకున్నాకే స్పందిస్తానని మాణిక్ రావు థాక్రే వెల్లడించారు.
మరోవైపు.. మాణిక్ థాక్రేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలోని లాంజ్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నే తాను ఇప్పుడు చెప్పినట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తు వుండదని వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న నాయకులు కూడా తనను తిట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు నా వ్యాఖ్యల్ని రాజకీయం చేస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో హంగ్ వస్తుందని తాను అనలేదని ఆయన పేర్కొన్నారు. తాను ఏ కమిటీలోనూ లేనని.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి తాను నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని కోమటిరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్‌తో పొత్తు వుంటుందని కూడా తాను చెప్పలేదని.. తన వ్యాఖ్యలు అర్ధం అయ్యే వాళ్లకు అర్ధం అవుతాయని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ALso REad: అంతా అధిష్టానం చూసుకుంటుంది.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన
అంతకుముందు మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లే ఏర్పాటు కాలేదన్నారు. తెలంగాణ ఇచ్చింది తాము.. ఇచ్చింది తామేనని వీహెచ్ తెలిపారు. తెలంగాణ ప్రజల్ని చూస్తే సంతోషంగా వుందని, మార్పు వచ్చినట్లుగా వుందన్నారు. హంగ్ వస్తుందని కార్యకర్తల్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గందరగోళంలోకి నెట్టారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయొద్దని ఆయన హితవు పలికారు. వీలైతే తామున్నామని కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని వీహెచ్ సూచించారు. తమలో విభేదాలు లేవని.. అందరం కలిసే వున్నామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని వీ హనుమంతరావు జోస్యం చెప్పారు.