Asianet News TeluguAsianet News Telugu

గంటా సత్యనారాయణ రెడ్డికి కాంగ్రెస్ షాక్: పార్టీ నుండి బహిష్కరణ

కాంగ్రెస్  పార్టీ నుండి గంటా సత్యనారాయణ రెడ్డిని  బహిష్కరించారు. రావిర్యాల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో పాస్ ల విషయంలో నిరంజన్ , గంటా సత్యనారాయణరెడ్డిలు కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ ఇధ్దరు నేతలకు నోటీసులు ఇచ్చారు. క్రమశిక్షణ సంఘం ముందుగంటా సత్యనారాయణరెడ్డి హాజరు కాలేదు. దీంతో  ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు.

Telangana Congress expels Ganta Satyanarayana Reddy from party
Author
Hyderabad, First Published Aug 23, 2021, 9:16 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి  గంటా సత్యనారాయణను బహిష్కరించింది . రావిర్యాలలో  కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత దండోరా సభ సందర్భంగా గాంధీ భవన్ లో  కాంగ్రెస్ అగ్రనేతలపై గంటా సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

also read:రేవంత్‌పై వ్యాఖ్యలు.. ఇద్దరు కాంగ్రెస్ నేతలపై టీపీసీసీ కన్నెర్ర, షోకాజ్ నోటీసులు

గంటా సత్యనారాయణ రెడ్డితో పాటు మాజీ టీపీసీసీ సెక్రటరీ నిరంజన్ కూడ  కాంగ్రెస్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరికి కూడ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ఇవాళ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే క్రమశిక్షణ కమిటీ ముందు ఇవాళ గంటా సత్యనారాయణరెడ్డి హజరు కాలేదు.  

కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ ముందు  మాజీ టీపీసీసీ సెక్రటరీ నిరంజన్ హాజరయ్యారు.మరోసారి వివరణ ఇవ్వాలని నిరంజన్ కు క్రమశిక్షణ  కమిటీ  ఆదేశించింది

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై వేగంగా చర్యలు తీసుకొంటున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా నేతలనుదూషించిన నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలు తీసుకొంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios