రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నాయకులపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం కొరడా ఝళిపించింది. టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి టి.నిరంజన్‌, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఘంటా సత్యనారాయణ రెడ్డిలకు క్రమశిక్షణా సంఘం శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది 

రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నాయకులపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం కొరడా ఝళిపించింది. టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి టి.నిరంజన్‌, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఘంటా సత్యనారాయణ రెడ్డిలకు క్రమశిక్షణా సంఘం శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఇటీవల ఆత్మగౌరవ దండోరా సభల విషయంలో వీరిద్దరూ నాయకత్వంపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వెంటనే సానుకూల వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred