Asianet News TeluguAsianet News Telugu

విడతలవారీగా తెలంగాణలో బస్సు యాత్రలు, సభలు: కాంగ్రెస్ సీనియర్ల కీలక నిర్ణయం

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  కాంగ్రెస్ పార్టీ  కీలక నిర్ణయం తీసుకుంది.  బస్సు యాత్రలు, జిల్లాల్లో సభలు నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.

  Telangana Congress  Decided to Conduct  Bus Yatra  Phase Wise lns
Author
First Published Jul 19, 2023, 3:47 PM IST | Last Updated Jul 19, 2023, 4:12 PM IST

హైదరాబాద్: విడతల వారీగా  రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.  భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో  బుధవారంనాడు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని  నేతలు  నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు  ప్రజలకు  నమ్మకం కల్గించేలా గ్యారెంటీ కార్డుపై ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ విషయాలపై  ఈ నెల  23న  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ  సమావేశంలో చర్చించాలని  నేతలు నిర్ణయించుకున్నారు.  మరో వైపు  ఈ నెల  30వ తేదీన కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ  సభ నిర్వహణపై  చర్చించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో  ప్రస్తావనకు వచ్చిన అంశాలపై  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ  తర్వాత  బస్సు యాత్ర షెడ్యూల్ ను  ఆ పార్టీ నేతలు  విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ ఇంచార్జీ మాణిక్ఇ రావు ఠాక్రే  ఇవాళ హైద్రాబాద్ కు  వచ్చారు. ఠాక్రే తో పాటు పార్టీ సీనియర్లను  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నివాసానికి పిలిచారు.

రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బస్సు యాత్ర చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై నేతలు చర్చించారు.  బస్సు యాత్రను విడతల వారీగా  నిర్వహించాలని  నేతలు  అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుండి చేరికల నేపథ్యంలో  ప్రస్తుతం పార్టీలో ఉన్నవారికి ఇబ్బందులు తలెత్తకుండా  చర్యలు తీసుకోవాలనే సూచనలు వచ్చినట్టుగా సమాచారం.

also read:కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ: కర్ణాటక ఫార్మూలా, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

మరో వైపు జిల్లాల వారీగా  భారీ బహిరంగ సభలు  నిర్వహించాలని కూడ  సూచన ప్రాయంగా  నిర్ణయం తీసుకున్నారు. ఈ సభల్లో పార్టీ సీనియర్లు పాల్గొనడం ద్వారా  పార్టీ నేతలంతా ఐక్యంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుందనే  అభిప్రాయాలను  కొందరు నేతలు వ్యక్తం చేశారని సమాచారం.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios