Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టలు: ఏపీపై కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి పిర్యాదు చేసింది. కృష్ణా బేసిన్ కు అవతల వైపున కృష్ణా నీటిని తరలించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది., ప్రకాశం బ్యారేజీకి దిగువన ఏపీ ప్రభుత్వం నిర్మించే ఆనకట్టలను నిలిపివేయాలని కోరింది. 

Telangana complains Against Andhra Pradesh To KRMB
Author
Hyderabad, First Published Jul 5, 2022, 5:06 PM IST


హైదరాబాద్: Andhra Pradesh  ప్రభుత్వంపై Telangana ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( కేఆర్ఎంబీ) మంగళవారం నాడు ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య కొంత కాలంగా నీటి విషయమై వివాదాలు సాగుతున్నాయి..ఈ విషయమై రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొంటూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఏపీ సర్కార్ పై తెలంగాణ ప్రభుత్వం పిర్యాదు చేసింది. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై రెండు ఆనకట్టల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది.

Krishna నదితో పాటు Godavari  నదిపై రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. ఆయా బోర్డుల అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న ప్రాజెక్టులంంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొంటున్నాయి. 

తాజాగా రెండు ఆనకట్టల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై KRMBకి తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ Muralidhar Rao  లేఖ రాశారు. కృష్ణా జలాలపై ఆధారపడి YS Jagan  సర్కార్ స్టోరేజీ పథకాలను తీసుకురావడంపై KCR  ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. తాగు నీటి అవసరాలకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కృష్ణా బేసిన్ కు అవతలివైపున ప్రాంతాలకు నీటిని పంపింగ్ చేయడం సరైంది కాదని కూడా మురళీధర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పథకాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే అవకాశం ఉందనే తెలంగాణ అభిప్రాయపడుతుంది. ఈ విషయమై  కోర్టులను ఆశ్రయించింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖలకు ఫిర్యాదు చేసింది. మరో వైపు తెలంగాణ సర్కార్ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్, కల్వకుర్తి లిఫ్ట్ విస్తరణతో పాటు ఇతర ప్రాజెక్టులపై కూడా ఏపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరి నదిపై ఖమ్మం జిల్లాలో తెలంగాణ నిర్మిస్తున్న పనులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

కృష్ణా నదిలో నీటిని 50:50 శాతం పద్దతిలో పంచాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది.ఈ విషయమై కేఆర్ఎంబీని తెలంగాణ ఈ ఏడాది మే 6న కూడా కోరింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు కూడా తెలంగాణ లేఖలు రాసింది. అయితే తెలంగాణ డిమాండ్ ను ఏపీ వ్యతిరేకిస్తుంది. ప్రతి ఏటా మాదిరిగానే నీటి వాటాను పంచాలని ఏపీ చెబుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios