ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. వీరిద్దరూ దాదాపు గంట పాటు ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో చర్చించారు. 

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. వీరిద్దరూ దాదాపు గంట పాటు ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, నిధుల మంజూరు గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీతో రేవంత్ , భట్టి విక్రమార్కలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Scroll to load tweet…