Asianet News TeluguAsianet News Telugu

ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. 

telangana cm kcr will launch the Dharani portal on October 29
Author
Hyderabad, First Published Oct 23, 2020, 6:07 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. 

దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. 

ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సిఎం పేర్కోన్నారు. ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సిఎం తెలిపారు.

Also Read:కొత్త రెవెన్యూ చట్టం: ప్రజల ఆస్తుల రక్షణ కోసమేనన్న కేసీఆర్

భూ వివాదాలు , ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు సిఎం చెప్పారు. 

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు,  వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్ లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ (మ్యూటేషన్) చేయించుకోవాలని సిఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios