తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. కాగా... ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత కేసీఆర్ బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.

అక్కడి నుంచి పెద్ద కోటపై నిర్మిస్తున్న ఆలయన నగిరిని కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆలయ నిర్మాణాలపై అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం కోసం  ముఖ్యమంత్రి స్థల పరిశీలన కూడా చేయనున్నట్లు సమాచారం.

మహా సుదర్శన యాగానికి  దాదాపు 100 ఎకరాలు అసవరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే అనువైన ప్రాంతం గురించి సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించే అవకాశం ఉంది. ఈ పనుల అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి శనివారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.