భారతీయ రాష్ట్ర సమితి .. ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని పరిశీలించిన కేసీఆర్

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని పరిశీలించారు. మరమ్మత్తు పనులు జరుగుతున్నందున వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

telangana cm kcr visited brs temporary office in new delhi

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లారు. అక్కడి ఏర్పాట్లను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని ములాయం స్వగ్రామం సైఫాయ్‌కి చేరుకున్న చంద్రశేఖర్ రావు.. ఆయన పార్ధివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ములాయం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ని ఓదార్చారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్‌ నేతలు కూడా ములాయం అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ములాయంను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. సైఫాయ్ జనసంద్రంగా మారిపోయింది. 

ఇకపోతే... జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని మరింత త్వరగా నిర్మించాలని కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో టీఆర్ఎస్ కు భవనం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. వసంత్ విహార్ లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి 2021 సెప్టెంబర్ 2న కేసీఆర్ భూమి పూజ చేశారు.  పార్టీ భవన నిర్మాణ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి.

ALso REad:న్యూఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక ఆఫీస్: స్వంత భవన పనులు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశం

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశించనున్నందున ఢిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాటు అనివార్యంగా మారింది. దీంతో ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్ లో  బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అద్దె భవనంలోనే పార్టీ కార్యాలయం కొనసాగనుంది. ఈ కార్యాలయంలో మరమ్మత్తు పనులు చేస్తున్నారు. వారం రోజుల్లో ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ఇక్కడి నుండే బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios