తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ బయలుదేరి వెళ్లనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. కొల్హాపూర్ కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారిని కేసీఆర్ దర్శించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 

ఇక, దేశంలో ఉన్న అన్ని మహాలక్ష్మి ఆలయాలతో పోలిస్తే... కొల్హాపూర్ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉందని చెబుతారు. ప్రళయకాలం సంభవించినప్పుడు పరమశివుడు కాశీక్షేత్రాన్ని కాపాడినట్లుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం లక్ష్మీదేవి కూడా తన చేతులతో ఈ ప్రాంతాన్ని ఎత్తి కాపాడిందని స్థలపురాణం చెబుతుంది. పంచగంగ నదీ ఒడ్డున ఉన్న అమ్మవారిని.. జగద్గురువు ఆదిశంకరాచార్యులూ, ఛత్రపతి శివాజీతోపాటూ ఎందరో రాజులు దర్శించుకున్నట్లుగా చరిత్ర చెబుతోంది.