తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. పంటి నొప్పి తీవ్రం కావడంతో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా అధికారులు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR బుధవారం నాడు Delhi వెళ్లనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కొంత కాలంగా ఢిల్లీ లోని AIIMS లోనే సీఎం కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఎయిమ్స్ లోనే సీఎం కేసీఆర్ పంటి నొప్పికి చికిత్స తీసుకొన్నారు. అయితే మళ్లీ పంటి నొప్పి తీవ్రం కావడంతో కేసీఆర్ ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఈ విషయమై అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలవాలని సీఎం భావిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఆయన సతీమణి శోభ ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం వారం రోజులకు పైగా ఢిల్లీలోనే ఉన్నారు. పలువురు సీఎంలు, పలు పార్టీల నేతలను కలిసి హైద్రాబాద్ కు తిరగి వచ్చారు.

ఈ నెల 11వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన యశోద ఆసుపత్రిలో చేరారు. ఎడమ చేయి, ఎడమ కాలు నొప్పి పెడుతుందని సీఎం కేసీఆర్ వైద్యులకు చెప్పారు. దీంతో యశోద ఆసుపత్రిలో పలు పరీక్షలు నిర్వహించారు. యాంజియోగ్రామ్ టెస్టుతో పాటు పలు పరీక్ష ఫలితాల్లో అన్నీ కూడా నార్మల్ గా నే ఉన్నాయని వైద్యులు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు కేసీఆర్ కు సూచించారు. యశోద ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున అసెంబ్లీకి హాజరయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా సభ్యులకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేంద్రీకరిచారు. 2024 ఎన్నికల నాటికి దేశంలో కొత్త రాజకీయ వేదిక వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. ఈ మేరకు కేసీఆర్ గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించారు. ఈ వషయాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు.

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏక తాటిపైకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు పార్టీలు, వీజేపీయేతర పార్టీ సీఎంలను సీఎం కేసీఆర్ కలిశారు. రానున్న రోజుల్లో ఈ కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని కూడా తెలంగాణ సీఎం భావిస్తున్నారు.

2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర పార్టీ అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను కేసీఆర్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీయేతర పార్టీలన్నీ కూడా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా కోరారు. ఈ మేరకు పలు పార్టీలు, సీఎంలకు ఆమె లేఖ రాశారు. అయితే కేసీఆర్, మమత బెనర్జీలు కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారా వేర్వేరుగా నడుస్తారా అనేది భవిస్యత్తుల్లో స్పష్టత రానుంది.