Asianet News TeluguAsianet News Telugu

భారీ వర్షాలు: నేడు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలతో ఏర్పడిన పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం నాడు సమీక్షించనున్నారు.మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్నినిర్వహించనున్నారు సీఎం  కేసీఆర్.

Telangana CM KCR to conduct review meeting on Heavy rain and flood lns
Author
Hyderabad, First Published Oct 15, 2020, 10:45 AM IST

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలతో ఏర్పడిన పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం నాడు సమీక్షించనున్నారు.మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్నినిర్వహించనున్నారు సీఎం  కేసీఆర్.

ఈ సమావేశానికి  హాజరుకానున్న అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైద్రాబాద్ తో పాటు పలు  జిల్లాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన నష్టంపై నివేదిక తయారు చేయనున్నారు.  

also read:హైద్రాబాద్ పాతబస్తీలో విషాదం: వరద నీటిలో చిక్కుకొని ఇద్దరు మృతి

వర్షాలతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం  నివేదికను అందించనుంది.భారీ వర్షాల కారణంగా హైద్రాబాద్ నగరం వణికిపోయింది. హైద్రాబాద్ నగరంలోని సుమారు 1500 కాలనీలు ఇంకా నీీటిలో మునిగిపోయాయి.ఇవాళ కూడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో వరదల కారణంగా చోటు చేసుకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఈ విషయమై ఆయన బుధవారం నాడు సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios