తెలంగాణ అభివృద్దిని ప్రధాని సైతం గుర్తించారు: యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శం : కేసీఆర్

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 15, Aug 2018, 11:15 AM IST
Telangana CM KCR Speech on Independence Day
Highlights

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులను స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని  మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం ఎంతో నిబద్దతతో, పరిణతితో రాష్ట్ర అభివృద్ది కోసం పాటుపడుతోందని అన్నారని గుర్తుచేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో ముందుచూపుతో, ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేసుకుంటున్నారని ప్రశంసించారని కేసీఆర్ తెలిపారు. 

చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదేలైన వివిధ రంగాలు స్వరాష్ట్రంలో  పునరుత్తేజం పొందాయని కేసీఆర్ అన్నారు. పేద, అణగారిన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండదండలు కల్పిస్తున్నాయన్నారు. సకల రంగాలలో వేగంగా పురోగమిస్తూ అతి తక్కువ కాలంలోనే తెలంగాణ  దేశం గర్వించే రాష్ట్రంగా  గుర్తింపు పొందిందన్నారు. అనేక ఒడిదుడుకులను అధిగమించి తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి  దోహదం చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చిల్లర మల్లర రాజకీయాలతోనో , వ్యర్థ వివాదాలతోనో  పొద్దు పుచ్చడం లేదని అన్నారు. ఈ నాలుగు సంవత్సరాల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్తుకు తగిన అభివృద్ధి  ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణా ప్రస్థానం సాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. 

loader