ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రూపు రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

తాజా ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడానికి అనేక కారణాలున్నాయన్నారు. పొంగులేటి తన ఇంటి మనిషని.. తుమ్మల, పొంగులేటి రాజకీయ స్థానాలు భద్రంగా ఉన్నాయని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

రాజకీయంగా చిన్న చిన్న పొరపొచ్చాలున్నా తుమ్మల, పొంగులేటి కలిసి పనిచేసి నామాను భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ సూచించారు. పొంగులేటికి మంచి రాజకీయ అవకాశాలుంటాయని స్పష్టం చేశారు.

సుమారు 58 శాతం ఓట్లతో నామా ముందంజలో ఉన్నారని కేసీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో గవర్నర్లు, రాయబారులు కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అవుతారని సీఎం జోస్యం చెప్పారు.