CM KCR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా ఎవరికీ పనికిరాని బడ్జెట్ ఇది అని ఆయన ఆరోపించారు. బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం తరహాలో ఉందని మండిపడ్డారు.
CM KCR: ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ దారుణమైన బడ్డెట్ ప్రవేశ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశ పెడుతూ.. మహాభారతంలోని శాంతి పర్వం శ్లోకాన్ని చదివి వినిపించారనీ. కానీ అందులో ప్రసావించినవి.. ఆ ధర్మమని, ఆసత్యమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఎవరికీ లాభం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం తరహాలో ఉందని మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ జనాభా చాలా పెరిగింది కానీ, వారి జనాభా విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు చెపుతుందని మండిపడ్డారు. రైతులు, సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా ఎవరికీ పనికిరాని బడ్జెట్ ఇది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర బడ్జెట్‌లో పెట్టిన నిధుల కంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులతో వారి సంక్షేమం కోసం పాటు పడుతోందని ఆయన అన్నారు.
రైతులకు మేలు చేయకుండా ఎరువులు, యూరియా మీద సబ్సిడీ తగ్గించారని, రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పాలనీ, బడ్జెట్ రైతుల ప్రస్తవన లేకపోవడం భాదకరమని కేసీఆర్ అన్నారు. ఉపాధి హామీ పథకానికి 25 కోట్ల కోత పెట్టడం బాధకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ ఇది అని.. ఇప్పటికి ప్రజలకు వీరి నిజస్వరూపం అర్థమైందని అన్నారు.
బీజేపీ పాలన అంటే.. దేశాన్ని అమ్మడం. మత పిచ్చి లేపడం. మంది మీద పడి ఏడవడం, ఆస్తుల అమ్మడమని.. బీజేపీదీ గోల్ మాల్ గోవిందం పాలసీ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గుజరాత్ మోడల్ అంటే.. పైనా పటారం.. లోన లోటారమని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో గోల్ మాల్ తప్ప వచ్చింది ఏం లేదనీ, కేంద్రానికి లేదనీ, మెదడు లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అత్యంత చెత్త పవర్ పాలసీ పాటిస్తుందనీ కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందిపడ్డ పరిస్థితులు చూసిన తరువాత కూడా ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపరచేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అన్నారు. ఆహార సబ్సిడీకి నిధులు తగ్గించారని విమర్శించారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో దేశం 101 స్థానంలో ఉండటం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ దేశానికి ప్రధాని కాదు.. ఆయన గుజరాత్ కే ప్రధాని అని ఏద్దేవా చేశారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారా ? అని మండిపడ్డారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీ కట్టబెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు.కేంద్రం .. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కాదు.. రైతుల పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్ల ధనం తీసుకోచ్చారా? ఇంటికి 15 లక్షలు ఇస్తారని అన్నారు .. ఇచ్చారా? అని ప్రశ్నించారు. గజదొంగలు, మోసగాళ్లును దేశం దాటించిన ఘనత మోడీకే దక్కుతుందని అన్నారు. హైల్ బడ్జెట్ ఒక్క రూపాయి కూడా పెంచాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 15 లక్షల ఉద్యోగ ఖాళీ ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా తెలంగాణలో ధర్నాలు చేస్తామని బీజేపీ సిగ్గులేకుండా చెబుతోందని విమర్శించారు. వ్యవసాయ బావుల దగ్గర కరెంట్ మీటర్లు పెట్టడం సంస్కరణలా అని ప్రశ్నించారు.
దేశంలో నదులను ఏ ప్రతిపాదికన అనుసంధానం చేశారనీ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకే సొంతమైన గోదావరి, కృష్ణ నదుల నీటిని కావేరిలో ఎలా కలుపుతారు? ఆ నీటిపై తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవివాదాలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఏ ప్రతిప్రాదిక నదుల అనుసంధానం చేస్తున్నారని ఆగ్రహం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో మాట్లాడకుండా కృష్ణా గోదావరి కావేరి నదుల అనుసంధానం చేస్తామని ఎలా ప్రకటిస్తారని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీ 30 శాతం పెంచడమేమిటీ? అసలు దేశంలో క్రిప్టో కరెన్సీ ఆమోదించారా? అని కేంద్రాన్ని నిలిదీశారు. కరోనా కష్ట కాలంలో కేంద్రం దరిద్ర కొట్టు నిర్ణయాలు తీసుకున్నారని, దేశంలో 65 టీఎంసీ ఉన్నా.. 35 టీఎంసీల నీటిని సరిగా ఉపయోగించు కోలేకపోతున్నారని, అది కేంద్రం చేతగానితనమని ఆరోపించారు.
