ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ కు సమాధానమిస్తూ కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లును కేసీఆర్ ప్రవేశ పెట్టారు.
హైదరాబాద్: రాష్ట్రాలను అణచివేస్తాం, రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తామనే దుర్మార్గమైన వైఖరితో కేంద్రం ఉందని తెలంగాణ సీఎం KCR విమర్శించారు.
Telangana Assembly Budget సమావేశాల చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ చర్చను ప్రారంభించారు. ఆ తర్వాత CLP నేత ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.
బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనేక సమస్యలకు దారి తీస్తాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ స్పూర్తికి కేంద్రం దెబ్బతీస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. IAS, IPS లపై కేంద్రం పెత్తనంం తీసుకోవాలని చూస్తోందన్నారు.ఈ విషయమై తాము కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టామని కేసీఆర్ చెప్పారు.దేశంలో ఫెడరలిజం ప్రమాదంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రం పనితీరు మనకన్నా దారుణంగా ఉందన్నారు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా కొత్త పుంతలు తొక్కుతోందని కేసీఆర్ చెప్పారు. దేశ తొలి బడ్జెట్ 190 కోట్లు, అయితే అందులో 91 కోట్లు రక్షణ శాఖకే కేటాయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో ఏపీ బడ్జెట్ రూ.680 కోట్లు అని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడేమో బడ్జెట్ లక్షల కోట్లకు చేరుకుందన్నారు.
ప్రస్తుతం భారత దేశం అప్పు 152 లక్షల కోట్లుగా ఉందన్నారు. మన కన్నా అప్పలు ఎక్కువ చేస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.ఇప్పుడు అప్పులు కూడా వనరుల సమీకరణగానే చూడాలని కేసీఆర్ సూచించారు.అప్పులు తీసుకోవడంలో మనం 25వ స్థానంలో ఉన్నామని కేసీఆర్ వివరించారు.అప్పుల విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. మన రాష్ట్రం అప్పుల శాతం 23 శాతం మాత్రమేనని చెప్పారు. అప్పుల విషయంలో భట్టి విక్రమార్కు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పూర్తి పారదర్శకంగా తమ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆర్ధిక క్రమశిక్షణను కఠినంగా పాటిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
Budget అంటే నిధుల కూర్పు అని కేసీఆర్ వివరించారు. బడ్జెట్ అంటే ఏదో బ్రహ్మ పదార్ధం కాదన్నారు. బడ్జెట్ రాష్ట్ర, దేశ అభ్యుదయానికి తోడ్పడాల్సిన అవసరం ఉంందన్నారు.
హిజాబ్ పై ఇలా..
ఐటీ రంగంలో Banglore సిలీకాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారని కేసీఆర్ గుర్తు చేశారు. హైద్రాబాద్ నుండి లక్షన్నర కోట్ల ఐటీ ఎగుమతులు చేస్తున్నామన్నారు. ఎవరు ఏ బట్టలు వేసుకొంటే ప్రభుత్వాలకు ఏం సంబంధమని కేసీఆర్ ప్రశ్నించారు. మత కలహాలు పెట్టి Hijab పంచాయితీ పెట్టారని ఆయన విమర్శించారు. హిజాబ్ లాంటి ఇష్యూలు ఉంటే పారిశ్రామిక వేత్తలు వస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి వివాదాలు మన దేశ యువత భవిష్యత్తును దెబ్బ తీస్తాయని కేసీఆర్ చెప్పారు. సంకుచిత ఆలోచనలు చేస్తే దేశం ఏమౌతుందని ఆయన ప్రశ్నించారు. UPA ను ఓడించి ఎన్డీయేను ెగలిపించినందుకు దేశ ప్రజల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టుగా ఉందని ఎన్డీఏ పనితీరుపై కేసీఆర్ సెటైర్లు వేశారు. .మత కలహాలు పెట్టి ప్రజలను విడదీస్తే ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.
