ఎల్బీ స్టేడియంలో (lb stadium) జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో (christmas celebrations) పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం ఉన్మాద స్థాయికి వెళ్తే ప్రమాదమన్నారు. పిచ్చి ముస్లిం రాజులు హిందూ ఆలయాలను కూలగొట్టారని.. ఇంకో మతం వారు మరో మతం ప్రార్ధనా మందిరాలను కూలగొట్టారని.. ఈ దాడుల వల్ల సాధించేముందని కేసీఆర్ ప్రశ్నించారు

ఎల్బీ స్టేడియంలో (lb stadium) జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో (christmas celebrations) పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం ఉన్మాద స్థాయికి వెళ్తే ప్రమాదమన్నారు. ఉన్మాద స్థితిలోనే తప్పులు జరుగుతాయని... మనిషిని మనిషిగా చూడలేనివాడు మనిషి కాదని సీఎం వ్యాఖ్యానించారు. పిచ్చి ముస్లిం రాజులు హిందూ ఆలయాలను కూలగొట్టారని.. ఇంకో మతం వారు మరో మతం ప్రార్ధనా మందిరాలను కూలగొట్టారని.. ఈ దాడుల వల్ల సాధించేముందని కేసీఆర్ ప్రశ్నించారు. మైనార్టీలపై దాడులు తాత్కాలికమేనన్నారు.

మాన‌వ మ‌నుగ‌డ ఎన్నో ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల క్రితం ఈ భూగోళం మీద ప్రారంభ‌మైందని... మాన‌వ జీవితం అతి ఉజ్వ‌లంగా ముందుకు సాగ‌డానికి ఏ త‌రంలో చేప‌ట్టాల్సిన ప‌నులను ఆ త‌రంలో చేపట్టారని కేసీఆర్ గుర్తుచేశారు. దాంతో మ‌నం ఇవాళ ప్ర‌శాంతంగా బ‌తుకుతున్నామని.. శాస్త్ర‌వేత్త‌లు ఎన్నో అమూల్య‌మైన విష‌యాల‌ను ఈ స‌మాజానికి స‌మ‌కూర్చారని సీఎం ప్రశంసించారు. ఈ రోజు మ‌నం నివ‌సిస్తున్న నాగ‌రిక స‌మాజానికి చేరుకోవ‌డానికి ఎంతో మంది మ‌హానుభావులు త్యాగాలు చేశారని కేసీఆర్ గుర్తుచేశారు.