తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ అందించే ప్రతిష్టాత్మకమైన ‘ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు’కు ఆయన ఎంపికయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ అందించే ప్రతిష్టాత్మకమైన ‘ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు’కు ఆయన ఎంపికయ్యారు. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ బుధవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపారు.

కొత్త రాష్ట్రమైనా.. పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పారని అభినందించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఆటోమెటిక్‌గా అనుమతుల ప్రక్రియకు టీఎస్ ఐపాస్ ద్వారా శ్రీకారం చుట్టడం వంటి విజయాలను సీఎం సాధించారని టైమ్స్ గ్రూప్ పేర్కొంది.

అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలని కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. మరోవైపు తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు టైమ్స్ గ్రూప్ యాజమాన్యానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవానికి తప్పకుండా హాజరవుతానని తెలిపారు.