Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీపీసీఆర్ టెస్టులో తేలని ఫలితం.. కేసీఆర్‌కు త్వరలో మళ్లీ పరీక్షలు

ఆర్టీపీసీఆర్ పరీక్షలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కచ్చితమైన ఫలితం రాలేదు. ఈ విషయాన్ని కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కేసీఆర్‌కు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. 

Telangana CM KCR RTPCR test result details ksp
Author
Hyderabad, First Published Apr 29, 2021, 9:43 PM IST

ఆర్టీపీసీఆర్ పరీక్షలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కచ్చితమైన ఫలితం రాలేదు. ఈ విషయాన్ని కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కేసీఆర్‌కు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో వున్నారని ఎంవీ రావు పేర్కొన్నారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితం రాదని ఆయన చెప్పారు. 

కాగా, నిన్న సీఎంకు నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం రేపు రానుంది. కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు.

కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. మరోవైపు నోముల భగత్‌కు కూడా కరోనా సోకింది.

Also Read:కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్: యాంటిజెన్ టెస్ట్‌లో నెగిటివ్, రేపు ఆర్టీపీసీఆర్‌ రిజల్ట్

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నిపుణులైన వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీటీ స్కాన్‌తో పాటు ఆరు రకాల పరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.

సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే వున్నాయని.. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్తపరీక్షల కోసం శాంపిల్స్‌ను తీసుకున్నట్లు చెప్పారు. రక్తపరీక్షలు రేపు రానున్నాయి.

సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే వుందని.. త్వరలో కోలుకుంటారని ఎంవీ రావు తెలిపారు. ఆయనకు కోవిడ్ లక్షణాలు పోయాయని.. పూర్తి ఆరోగ్యంగా వున్నారని, త్వరలోనే విధులుకు హాజర్యే అవకాశం వుందని డాక్టర్ చెప్పారు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగానే వున్నాయని ఎంవీ రావు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios