రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందాలని కేసీఆర్ ఆదేశించారు.

జీహెచ్ఎంసీలో సహాయ కార్యక్రమాలకు రూ.5 కోట్లతో పాటు మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతి ఇంటికి 3 రగ్గులతో పాటు నిత్యావసరాలు అందజేస్తామని.. పూర్తిగా కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు.

పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మత్తులు చేయిస్తామని, నాలాలపై కూలిన ఇళ్లకు బదులు కొత్త ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందాలని ఆయన సూచించారు.