కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్ధిక నష్టంపై రేపు ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్నారు. 2020- 21 బడ్జెట్‌పైనా మధ్యంతర సమీక్ష జరపనున్నారు కేసీఆర్.

కరోనా తాజా పరిస్ధితులు, తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఇక సమీక్షలో వచ్చే అంశాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం వుంది.

మరోవైపు తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,602 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 2,47,284 నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1366కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 982 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,26,646కు చేరింది.