సీఎం ఎక్కడుంటే  అక్కడే సెక్రటేరియట్‌ అని తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ చెప్పారు


హైదరాబాద్: సీఎం ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్‌ అని తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ చెప్పారు. తనపై తప్పుడు విమర్శలు చేసిన విపక్ష నేతలు ఎక్కడున్నారని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సోమవారం నాడు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాట్లాడారు.తెలంగాణలో ప్రతిపక్షం మూర్ఖంగా వ్యవహరించిందన్నారు. తనపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేశారని కేసీఆర్ చెప్పారు. సెక్రటేరియేట్‌ రానని, ఫామ్‌మౌజ్‌కే పరిమితమయ్యానని తనపై విమర్శలు చేసిన వారు ఏమయ్యారో అందరికీ తెలుసునని కేసీఆర్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.

సీఎం ఎక్కడుంటే అదే సెక్రటేరియట్‌ అని కేసీఆర్ చెప్పారు. నాలుగు పార్టీలను ఏకం చేయడం రాజకీయం కాదన్నారు. తెలంగాణలో బీసీలు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. విద్య,వైద్యం, పట్టణాభివృద్ధిపై కేంద్రం పెత్తనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుది తప్పుడి తీర్పుగా ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్