Asianet News TeluguAsianet News Telugu

యశోద ఆసుపత్రికి కేసీఆర్: కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన సీఎం

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో  మెదక్ ఎంపీ  కొత్త ప్రభాకర్ రెడ్డి  పరామర్శించారు.  

Telangana CM KCR Reaches to  yashoda hospital, consoles  kotha prabhakar reddy lns
Author
First Published Oct 30, 2023, 8:13 PM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారంనాడు పరామర్శించారు. ఇవాళ సూరంపల్లిలో  కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని ముగించుకొని వెళ్లే సమయంలో  దాడి జరిగింది.  

ఈ దాడిలో  కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ ఆసుపత్రిలో  ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత  సికింద్రబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో  కొత్త ప్రభాకర్ రెడ్డికి వైద్యులు  శస్త్రచికిత్స నిర్వహించారు.  శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత యశోద ఆసుపత్రికి  కేసీఆర్ చేరుకున్నారు.కొత్త ప్రభాకర్ రెడ్డికి అందుతున్న వైద్య సహాయం గురించి  సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.  మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు.

 

కత్తి పోటు కారణంగా చిన్న ప్రేగు కు నాలుగు చోట్ల గాయాలైన విషయాన్ని  వైద్యులు  గుర్తించారు.15 సెంటిమిటర్లపై కడుపు ను కట్  చేసి 10 సెంటిమీటర్లు చిన్న పేగును యశోద వైద్యులు తొలగించారు. గ్రీన్ ఛానెల్ తో హైదరాబాద్ కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కత్తిపోటు కారణంగా రక్తం  కడుపులో పేరుకుపోయింది. 15 సెంటిమిటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం క్లీన్ చేశారు.పేగుకు 4 చోట్ల గాయాలయ్యాయి.

also read:కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: రేవంత్ రెడ్డి

ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.ఈ రకమైన రాజకీయాలు సరైంది కాదని  కేసీఆర్ చెప్పారు.  తమ ఎజెండా చెప్పి  ప్రజల మద్దతుతో విజయం సాధించాలన్నారు. కానీ హింస రాజకీయాలు సరికాదని కేసీఆర్  అభిప్రాయపడ్డారు.ఈ ఘటనపై  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విచారం వ్యక్తం చేశారు.  ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని  ఆమె  డీజీపీని ఆదేశించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios