తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్ట్ మొదటి పంపు వెట్ రన్ విజయవంతమైంది. దీని పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్ట్ మొదటి పంపు వెట్ రన్ విజయవంతమైంది. దీని పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇంతటి భారీ సామర్ధ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్.. ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించాయన్నారు.
గతంలో 80 నుంచి 85 మీటర్ల వరకు ఎత్తిపోసిన అనుభవం ఉందని సీఎం గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక్కో పంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తువరకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉందని.. దీనిని తయారు చేయడానికి, మన ఇంజనీర్లు, అధికారులు విధేశాలకు వెళ్లి అధ్యయనం చేసి పనులు చేపట్టారన్నారు.
భగవంతుడి ఆశీస్సుల వల్ల అనుకున్నది అనుకున్నట్లు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రైతుల తలరాత మార్చే అదృష్టం.. ప్రాజెక్ట్ పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు కేసీఆర్ అభినందనలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసే కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నామని.. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో గత్యంతరం లేదని తీర్మానించుకున్నామని కేసీఆర్ తెలిపారు.
40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశామని, రక్షణ శాఖ అనుమతితో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లైడార్ సర్వే నిర్వహించి.. పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామని కేసీఆర్ వెల్లడించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 24, 2019, 7:39 PM IST