తెలంగాణాలో గవర్నర్ కోటలోని ఎమ్మెల్సీలను నింపేందుకు సర్కారు అడుగులు వేస్తుంది. రాములు నాయక్, నాయినిల పదవి కాలం ముగిసింది. కర్నె ప్రభాకర్ పదవి కలం ఆగస్టుతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 ఎమ్మెల్సీలను భర్తీ చేయాలనీ సర్కార్ యోచన చేస్తుంది. 

ఈ మూడు ఖాళీ స్థానాలను నింపాలని తెలంగాణ సర్కార్ ఇప్పుడు నిశ్చయించింది. ఇన్నాళ్లు కరోనా వల్ల దేశంలో అన్ని ఎన్నికలు వాయిదాపడ్డప్పటికీ... తాజా రాజ్యసభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికలతో అన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏపీ కూడా డొక్కా పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 

ఇక తెలంగాణాలో ఇప్పుడు నాయిని, కర్నె ప్రభాకర్ లకు రెన్యువల్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు తెలియవస్తుంది. మూడవ స్థానానికి అనూహ్యంగా కేసీఆర్ పీవీ కూతురు సురభి వాణీదేవి పేరును ప్రతిపాదించనున్నట్టుగా తెలియవస్తుంది. ఇది రాజకీయ ఎత్తుగడ అని పలువురు అంటున్నారు. 

ఈ మధ్యకాలంలో కేసీఆర్ పీవీని తెగ పొగిడేస్తున్నాడు. జూన్ 28 నుండి పీవీ నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయిన విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా పీవీ నరసింహారావు మన తెలుగు బిడ్డ అయినప్పటికీ.... ఆయన జయంతి దినోత్సవం మనలో చాలా మందికి తెలియదు. ఈసారి శతజయంతి ఉత్సవాలు సంవత్సరంపాటు జరపాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించడంతో ఈ విషయం ఇప్పుడు అందరికి తెలిసింది.

టీవీల్లో ప్రతిరోజు పీవీ నరసింహ రావు శతజయంతి ఉత్సవాల యాడ్స్ మనకు కనబడుతున్నాయి. (లాక్ డౌన్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం మీడియా సంస్థలకు ఒకింత మేలు చేసిందని చెప్పాలి)ఉదయం నుండి ఏ ఛానల్ చూసినా పీవీ నరసింహ రావు తెలంగాణ జాతి ముద్దు బిడ్డ అని, తొలి దక్షిణ భారతదేశ ప్రధాని అని తెలంగాణ ఐకాన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.

కేసీఆర్ ఇలా పీవీ నరసింహారావు ను తెలంగాణ ముద్దుబిడ్డగా ప్రకటించడం వెనుక కారణాల గురించి అందరూ తెగ యోచనలు చేస్తున్నారు. పీవీ నరసింహ రావు వాస్తవానికి కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రి అయ్యాడు. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. అయినా కేసీఆర్ ఇలా పీవీ నరసింహారావు ను ప్రొజెక్ట్ చేయడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని, అందుకే పీవీ కూతురికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని కట్టబెడుతున్నట్టుగా అంటున్నారు. 

ఇంకో అంశం పీవీని కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కారణాల వల్ల ప్రోజెక్ట్ చేయడానికి ఇష్టపడదు. ఆయనకు సోనియా గాంధీ కి అస్సలు పడదు అన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ వారికున్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని పీవీని తెలంగాణ సింబల్ గా, తెలంగాణ సెంటిమెంటును ఇప్పటికే కేర్ అఫ్ అడ్రస్ అని చెప్పుకుంటున్న తెరాస ఐకాన్ గా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. 

ఇప్పుడు ఈ ఎత్తుగడలో భాగంగానే ఆయన పీవీ కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నాడు. కాంగ్రెస్ వైఖరి పట్ల పీవీ కువైటుంబీకులు చాలా కోపంతోప్ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వాడుకోవాలని కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారు.